Make your inbox happier!

Subscribe to Our Newsletter

Tharuni Times

Celebrating the Spirit of Women

  • Empowering Happiness, Inspiring Life.
  • Joyful journey to celebrate life.
  • Forum for women with wings.
Editor's Note

Age is just a number

వయసులో పెరగటం కాదు ముఖ్యం…జీవితంలో ఎదగటం ముఖ్యం

అవును. మనం ఏమీ  చేయకుండా ముసుగు తన్ని పడుకున్నా… వచ్చే సంవత్సరం మన birthday వచ్చేస్తుంది. అంటే మన వయసుకు ఏడాది పెరుగుతుంది. కానీ, ఈ ఏడాది కాలంలో మనం ఎంత ఎదిగాము, మన జీవితానికి మనం ఎంత value add చేసాము అని ఆలోచించాలి. ఏటి పక్కన ఉన్న గులక రాయి కూడా కొన్ని వందల ఏళ్ళు ఏ కదలికా లేకుండా అలాగే ఉంటుంది. తాబేలు కూడా మూడు, నాలుగు వందల ఏళ్ళు బతుకుతాయి. మరి వాటికి, మనిషికి తేడా ఉంది కదా!    

ఈ ప్రకృతి లో బుద్ది వికసించే గుణం ఒక్క మనిషికే ఉంది. ప్రతి పుట్టిన రోజుకి ఒక purpose పెట్టుకుంటే ఆ రోజు ఎంతో తృప్తిగా celebrate చేసుకోవచ్చు. జీవితంలో చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే, మనం చేసిన అనేక మంచి పనులు, గడిపిన quality life  మనల్ని మనం very good అనుకునేలా ఉండాలి.

భగవంతుడు మనకు ఇచ్చిన ఈ విలువైన జీవితాన్ని , అందంగా, ఆనందంగా మలుచుకోవాలి అంటే ముందు మనం సమయం విలువ, మన శక్తి తెలుసుకోవాలి. ఒక goal పెట్టుకుంటే, ప్రతి విలువైన  క్షణాన్ని అర్ధవంతంగా చేసుకోగలుగుతాము. నా కుటుంబాన్ని చుసుకోవదానికే నా time అంతా అయిపోతుంది. ఇంకా నా personal goals  కి time ఎక్కడ ఉంటుంది అనుకునే వారు, ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి . Busy is a schedule … Priority is a choice. 24 గంటల్లో మనకి మనం కొంత సమయం ఇచ్చుకోవాలి అంటే ముందు మనకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి.

Pradeep Channel

Motivational Video

Skills

“Time Management”

క్షణం గడిచిపోతే మళ్ళి తిరిగి రాదు అనేది మనకు తెలుసు. అయినా సరే తెలియకుండానే ఎంతో సమయం వృధా చేసుకుంటాము. ప్రతిరోజూ మన account లో మన ప్రమేయం లేకుండానే 86,400 సెకండ్లు వచ్చి పడతాయి. దేశాన్ని పాలించే ప్రధాన మంత్రి నుండి, రోజు కూలి చేసుకునే వారి వరకు అందరికీ సమానమైన కాలమే ఉంటుంది. ప్రతి వారి watch లో same ముళ్ళు ఉంటాయి. మనం ఎంత efficient గా  ఆ సమయాన్ని వాడుకుంటాము అనేది మన time management skill  మీద ఆధారపడి ఉంటుంది.

ఉదయమే లేచి, హడావుడిగా పనులన్నీ చేసుకుని, ఆఫీస్ కి వెళ్లి, అక్కడ work చేసి, ఇంటికి వచ్చి తిరిగి పనులన్నీ చేసే సరికి time ఎలా అయిపోతుందో తెలీదు. ఇంక నా interests pursue చేసుకునే వీలు ఎక్కడుంది, అని నిస్పృహగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతో మంది. కరెక్టే. కానీ, మనం మన time ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే , ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. పొద్దున్నే చేసుకోవాల్సిన cooking తాలుకు వన్ని రాత్రే రెడీ చేసుకోవచ్చ్చు. వేసుకోవలసిన డ్రెస్ రెడీ గా పెట్టుకోవచ్చు. అప్పుడు మార్నింగ్ హడావుడి పడకుండా, ఒక అరగంట వాకింగ్, work out చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ పని, ఆఫీస్ లోనే పూర్తి చేసుకుంటే, ఇంటికి carry చేసే పని ఉండదు.

నిజానికి మనం చేయవలసిన పనులు మన మైండ్ ని occupy చేస్తాయి. దాని వలన సగం stress . అందుకే ఇక్కడ మీకు ఒక tip . TO DO LIST. అంటే, తెల్లవారి మనం చేయవలసిన పనులు, కట్టవలసిన బిల్ల్స్ అన్ని ఒక లిస్టు చేసుకోవాలి. దీని వలన, మనం ఒక్క పని కూడా మిస్ అవము.  అయితే ఇక్కడ మరొక విషయం. ఆ లిస్టు లో కూడా ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది లాస్ట్ అనేది తెలిసి ఉండాలి. ఉదాహరణకి , electricity బిల్ pay చేయడం లాస్ట్ day అవుతే, అది మీ priority . అంటే మీ list లో ఆ పని ఫస్ట్ ఉండాలి అన్నమాట.  మీ పనులని 4 categories గా డివైడ్ చేసుకోండి.

Urgent & Important

Electricity బిల్ last date

Urgent & Not important

Phone call – spam

Important & Not Urgent

Evening Meeting / marriage

Not Urgent & Not Important

Passing time with friends

సాధ్యమైనంత వరకు మనం well planned గా ఉంటే , 3 వ category –‘important కానీ not urgent’  best అనమాట.  అపుడు stress తీసుకోకుండా , హడావుడి పడకుండా పనులు పూర్తి చేసుకోవచ్చు.

Health

మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలంటే..

మహిళలు  నిత్యం ఇంటి పని, వంటపనితో పాటు బయట ఆఫీసు పనితో బిజీబిజీ ఉంటారు. ఈ టెన్షన్స్‌తో వారి ఫిట్‌నెస్‌‌పై, ఆహారం విషయంలో అసలు కేర్‌ తీసుకోరు. మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. రక్తహీనత, నీరసం, ఆలసట, తలనొప్పి, రోగనిరోధక శక్తి, తగ్గడం, సర్వైకల్ క్యాన్సర్, ప్రెగ్నెన్సీ సంబంధిత రుగ్మతలు, రొమ్ము క్యాన్సర్, ఆర్థరైటిస్, ఓవేరియన్ పాలీసిస్టోసిస్ వంటివి చాలా మంది మహిళలు బాధపడే కొన్ని తీవ్రమైన సమస్యలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, దాదాపు 40 శాతం మంది గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. గర్భాశయ క్యాన్సర్‌ కారణంగా.. 2018లో 311000 మంది మహిళలు మరణిస్తున్నారని వెల్లడించింది.

Woman performing a yoga pose on a rocky beach with ocean view and clear blue sky.

మహిళలు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలంటే కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా తయారు కావాలి. ఇందుకోసం చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏ వయసులో ఉన్న వారు ఆ వయసుకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సూచనలు చేశారు. అవేంటో చూసేయండి.

Colorful quinoa salad with fresh vegetables creates a healthy, balanced meal.

నిజానికి మనం చేయవలసిన పనులు మన మైండ్ ని occupy చేస్తాయి. దాని వలన సగం stress . అందుకే ఇక్కడ మీకు ఒక tip . TO DO LIST. అంటే, తెల్లవారి మనం చేయవలసిన పనులు, కట్టవలసిన బిల్ల్స్ అన్ని ఒక లిస్టు చేసుకోవాలి. దీని వలన, మనం ఒక్క పని కూడా మిస్ అవము.  అయితే ఇక్కడ మరొక విషయం. ఆ లిస్టు లో కూడా ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది లాస్ట్ అనేది తెలిసి ఉండాలి. ఉదాహరణకి , electricity బిల్ pay చేయడం లాస్ట్ day అవుతే, అది మీ priority . అంటే మీ list లో ఆ పని ఫస్ట్ ఉండాలి అన్నమాట.  మీ పనులని 4 categories గా డివైడ్ చేసుకోండి.

బ్రేక్‌ ఫాస్ట్‌ కచ్చితంగా తీసుకోండి..

నిజానికి మనం చేయవలసిన పనులు మన మైండ్ ని occupy చేస్తాయి. దాని వలన సగం stress . అందుకే ఇక్కడ మీకు ఒక tip . TO DO LIST. అంటే, తెల్లవారి మనం చేయవలసిన పనులు, కట్టవలసిన బిల్ల్స్ అన్ని ఒక లిస్టు చేసుకోవాలి. దీని వలన, మనం ఒక్క పని కూడా మిస్ అవము.  అయితే ఇక్కడ మరొక విషయం. ఆ లిస్టు లో కూడా ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది లాస్ట్ అనేది తెలిసి ఉండాలి. ఉదాహరణకి , electricity బిల్ pay చేయడం లాస్ట్ day అవుతే, అది మీ priority . అంటే మీ list లో ఆ పని ఫస్ట్ ఉండాలి అన్నమాట.  మీ పనులని 4 categories గా డివైడ్ చేసుకోండి.

జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి..

బయట దొరికే స్నాక్స్, జంక్‌ఫుడ్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది. మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్‌గా ఉండాలనుకుంటే.. ప్రాసెస్‌ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ ఆహారం మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి, అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి.

వ్యాయామం/ యోగా చేయండి..

శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారు కావడానికి వ్యాయామం/యోగా ఎంతగానో సహకరిస్తుంది. వ్యాయామం చేసే క్రమంలో శరీరంలోని కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలు బాగా సరఫరా అవుతాయి. తద్వారా గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. అలాగే కండరాలు దృఢంగా తయారవడంతో పాటు శరీరానికి శక్తి అందుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోని అదనపు క్యాలరీలు కరిగి బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. ఎక్సర్‌సైజ్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. భుజంగాసనం, భద్రాసనం, పవన్ ముక్తాసనం, నౌకాసనం, బాలాసన్, ఉష్ట్రాసనం చేయవచ్చు. మీరు ప్రతిరోజూ ధ్యానం చేస్తే… మానసికంగానూ ప్రశాంతంగా ఉంటారు.

Beauty TIP

బెల్లంతో చేసిన ఫేస్ వాష్  Anti-aging గా పనిచేసి ముడతలను కనిపించనీయదు. చిన్న బెల్లం ముక్క తీసుకొని, ఒక గిన్నెలో వేసి, టీ స్పూను నీళ్లు పోసి ఉంచాలి. బెల్లం కరిగిన తర్వాత, టీ స్పూన్ శనగపిండి, మజ్జిగ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ఏడు నిమిషాల పాటు వలయాకారంలో మర్దన చేయాలి. 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లని నీటితో కడిగేయాలి.  ముఖాన్ని పొడిగా తుడుచుకుని, moisturizer లేదా Aloe vera gel రాసుకోవాలి. ఈ face wash వాడటం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడటం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి.

గృహిణి నుండి వ్యాపారవేత్తగా ఎదిగిన Sheela Kochouseph విజయ గాధ

మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆమె సక్సెస్ ఒక ఉదాహరణ.

గృహిణి నుండి వ్యాపారవేత్తగా ఎదిగిన Sheela Kochouseph విజయ గాధ

మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆమె సక్సెస్ ఒక ఉదాహరణ.

గృహిణి కదా అని చిన్నచూపు చూడకూడదు. వాళ్ళు తలుచుకుంటే, ఎలాంటి లక్ష్యాలనైనా సాధించగలరు. మన భారత దేశంలో చాలా మంది గృహిణుల్లో చక్కగా వ్యాపారం చేయాలనే అభిరుచి ఉంటుంది. అలాగే  సొంతంగా ఏదైనా కెరీర్‌ను ప్రారంభించాలని చాలా మంది అనుకుంటారు.  అయితే వారికి ఆశించిన తోడుతోపాటు, ఆర్థిక వనరులు ఉండవు. దీంతో తమ వ్యాపార ఆలోచనను అక్కడితోనే ఆపేస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఓ గృహిణి, ఇంట్లోనే ఉంటూ లోదుస్తులు, ఇన్నర్ వేర్ బ్రాండ్ ని ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తోంది. తనకంటూ సొంత పేరును సంపాదించుకుంది. ఈమె కేరళకు చెందిన Sheela Kochouseph.

కేరళకు చెందిన Sheela ఒక వ్యాపారవేత్త భార్య. వారిది బాగా స్థిరపడిన కుటుంబం.  అయినా ఆమె తనదంటూ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించింది. తన ఆలోచనను భర్తతో పంచుకుంది. కానీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఆమె భర్త రెండు షరతులు పెట్టాడు. ఒకటి వ్యాపారం కోసం,  కుటుంబానికి సంబంధించిన డబ్బులను వాడుకోకూడదు. రెండోది, వ్యాపార కార్యాలయానికి, ఖాళీగా అద్దె కట్టకూడదు. చాలా సంవత్సరాలు గృహిణిగా ఉన్న షీలా తన భర్త సవాల్‌ను స్వీకరించింది. ఒక బ్యాంక్ నుంచి చిన్నపాటి లోన్ తీసుకొని V-Star Creations, అనే లోదుస్తుల బ్రాండ్ ను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అలా బ్యాంక్ రుణంతో 1995 లో ఓ పదిమందితో చిన్న బట్టల వ్యాపారం ప్రారంభించారు. కేరళ లో విక్రయిస్తున్న ఇన్నర్ వేర్ బట్టలు చాలా మటుకు ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి వస్తున్నాయని గ్రహించిన ఆమె, రాష్ట్రంలోనే , తాను బ్రాండ్ గా ఎదిగే లక్ష్యంతో వివిధ డిజైన్లు, రంగులతో నాణ్యమైన లోదుస్తులు, అండర్‌వేర్లను తయారు చేయడం ప్రారంభించింది. ప్రారంభంలో10 మంది ఉద్యోగులు చేత్తో కుట్టారు. సింపుల్ డిజైన్, అందుబాటు ధరల కారణంగా V-Star Creations, వృద్ధిచెందడం ప్రారంభించింది. ఇప్పుడు మల్టీ మిలియన్ డాలర్ల కంపెనీగా ఎదిగింది. 1995 లో Sheela Kochouseph స్థాపించిన V-Star Creations ఆదాయం దాదాపు 540 కోట్లకు పైగా చేరుకుందని పేర్కొంది. ఈ రోజు తన net worth ₹1,927.1 కోట్లకు పైన చేరుకుంది. షీలా  సక్సెస్ జర్నీ, నేటి మహిళలకు ఎంతో స్పూర్తిదాయకంగా ఉంటుంది. అలాగే మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆమె సక్సెస్ ఒక ఉదాహరణ. 

Talent Zone

తరుణీమణులుఅందరికీ ఒక శుభవార్త

Story Zone

ఓర్పు సహనం

ఒకసారి రెండు కప్పలు ఒక దారి గుండా ప్రయాణం చేస్తున్నాయి. కొంతదూరం వెళ్లాక, దారిలో అతి పెద్ద గంగాళం కనిపించింది. దాని నిండా వెన్న చిలకని మజ్జిగ ఉంది. ఆశగా అందులోకి తొంగిచూసిన రెండు కప్పలు, ప్రమాదవశాత్తు గంగాళంలోకి జారి పడ్డాయి. గంగాళానికి అంచు లేకపోవడంతో, ఆ కప్పలు ఎంత ప్రయత్నించినా, పైకి రాలేకపోతున్నాయి. పై దాక ఈదుకుంటూ వచ్చినా,  తిరిగి జారి పడిపోతున్నాయి.

చాలా సేపు ప్రయత్నించిన తర్వాత, అందులో ఒక కప్ప “మిత్రమా ఇంక నా వల్ల కాదు. నేను ఈదలేను నా శక్తి అయిపోయింది. ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటున్నాను అంటూ, రెండో కప్ప ఎంత వారించినా వినకుండా ప్రయత్నం ఆపేసింది. అడుగుకు జారిపోయి ప్రాణాలు వదిలేసింది. రెండవ కప్ప మాత్రం ఎంతో ఓర్పుతో, సహనంతో నిరంతరంగా ఈదుతూనే ఉంది అది వెన్న చిలకని మజ్జిగ కాబట్టి, కప్ప కదలికలకి కొంతసేపటికి వెన్న పేరుకోవడం మొదలైంది. మందంగా పేర్కొన్న వెన్న పైకి ఆ కప్ప నెమ్మదిగా ఎగబాకి బయటకి దూకేసి ప్రాణాలు దక్కించుకుంది.

నీతి

కష్టే ఫలి అన్నారు. ఓర్పు, సహనంతో ఎంత కష్టాన్నైనా అవలీలగా దాటవచ్చు

Fun Zone

"ధైర్యం ఎవరికెక్కువ?"

భార్య:

మన ఇద్దరిలో ఎవరికీ ధైర్యం ఎక్కువ చెప్పండి.

భర్త:

No doubt. నాకే.

భార్య:

మన పెళ్లి చూపులకి మీరు ఎంతమంది వచ్చారు?

భర్త:

మా family మొత్తం 8 మంది , నా ఇద్దరు friends వచ్చాము. అయినా, దానికి, దీనికి ఏమిటి సంబంధం?

భార్య:

మరి మన పెళ్లి తరవాత , నేను ఒక్క దాన్నే మీ ఇంటికి వచ్చాను కదా! మా family తో రాలేదు కదా! ఇప్పుడు చెప్పండి. ఎవరికీ ధైర్యం ఎక్కువో.

"ధైర్యం ఎవరికెక్కువ?"

Ask us

Send us your questions and we’ll address them in our next Journal!